Setlur: సెట్లూరులో ప్రయాణికుల కోసం చలి వేంద్రం ఏర్పాటు
Setlur: కామారెడ్డి జిల్లా సెట్లూరులో మండుతున్న ఎండల నేపథ్యంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో చలి వేంద్రం ఏర్పాటు చేశారు.
Setlur
Setlur: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం సెట్లూరు గ్రామంలో మండుతున్న ఎండల నేపథ్యంలో గ్రామ సర్పంచ్ కాళోజీ విఠల్ ఆధ్వర్యంలో చలి వేంద్రం ఏర్పాటు చేశారు.
ప్రజలు, బాటసారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు బిచ్కుంద – బిర్కూర్ ప్రధాన రహదారిపై ఈ చలి వేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామం గుండా ప్రయాణించే వారు తాగునీటి సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చన్నారు.
ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో వెంటనే చల్లని నీరు తాగకుండా కొంతసేపటి తర్వాత నీరు తాగాలని గ్రామ సర్పంచ్ ప్రజలు, ప్రయాణికులకు సూచించారు.
గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Next Story




