Banswada: రుద్రూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట హమాలీ కార్మికుల ఆందోళన!
Banswada: రుద్రూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీ కార్మికుల ఆందోళన. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేత.
Banswada: రుద్రూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట హమాలీ కార్మికుల ఆందోళన!
బాన్స్వాడ: రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత సముదాయముల భవనం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం హమాలీ కార్మికులు ఆందోళన చేపట్టి, తహసీల్దార్ తారాబాయి కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకుడు నన్నేసాబ్ మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని కోరారు.
55 సంవత్సరాలు నిండిన హమాలీ కార్మికులందరికీ 6వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 120 గజాల స్థలం కేటాయించి, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ కార్మికులు భీమయ్య, మహబూబ్, లక్ష్మణ్, సాయిలు, పీరయ్య, గంగాధర్, కిరణ్, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.
Next Story




