Kammarpally: ఉప్లూర్ గ్రామంలో లబ్ధిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

Kammarpally: కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో లబ్ధిదారునికి రూ. 20,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ పంపిణీ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Oct 2026 11:18 PM IST
Kammarpally
X

Kammarpally: ఉప్లూర్ గ్రామంలో లబ్ధిదారునికి సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారునికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రంగుల అశోక్ గౌడ్ గారికి 20.000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నిరుపేద కుటుంబాలకు ఒక వరం లాంటిదని, ఆపద సమయంలో పేదలకు ఆర్థికంగా ఎంతో సహాయపడుతుందని పేర్కొన్నారు.

లబ్ధిదారుడు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ చిక్కు మంజూరు కి కృషిచేసిన మాజీ సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ తక్కురి శేఖర్, నాయకులు తిప్పిరెడ్డి శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు డాక్టర్ నరేష్, మాజీ సర్పంచ్ బద్దం రమేష్ రెడ్డి. , కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్దం నగేష్ రెడ్డి , తిరుపతి రెడ్డి, ఫారుక్ . నజీర్. తక్కురి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్