Nizamsagar: డి సి సి అధ్యక్షుడి చేతుల మీదుగా సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Nizamsagar: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

VEERANNA, JUKKAL
Published on: 11 Jun 2026 3:46 PM IST
Nizamsagar
X

Nizamsagar: డి సి సి అధ్యక్షుడి చేతుల మీదుగా సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

నిజాంసాగర్ (కామారెడ్డి): ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్స చేయించుకోలేని స్థితిలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అండగ నిలుస్తోందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. గురువారం నిజాంసాగర్ మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులను అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం సి ఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ తో లబ్ధిదారులకు భరోసా కల్పిస్తుందని అన్నారు.పేద,మధ్య తరగతి కుటుంబాలు వైద్య చికిత్సల కోసం అప్పుల పాలవ్వకుండా ఉండేందుకు సి ఎం ఆర్ ఎఫ్ పథకం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం వారి వెన్నంటి ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

ప్రభుత్వం ద్వార మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసి వారి కుటుంబాలకు త్వరితగతిన ఆరోగ్య ప్రయోజనాలు అందాలని ఆకాంక్షించారు. కార్యక్రమం లో ఎన్ ఆర్ ఐ భుజం గారి భాస్కర్ రెడ్డి, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story