Kamareddy: కామారెడ్డిలో ట్రాఫిక్ వినాయకుడిని దర్శించుకున్న కలెక్టర్, ఎస్పీ!

Kamareddy: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇంద్ర చౌక్ వద్ద ట్రాఫిక్ వినాయకుడిని దర్శించుకున్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర.

MADHU, KAMAREDDY
Published on: 16 Sept 2026 1:14 PM IST
Kamareddy
X

Kamareddy: కామారెడ్డిలో ట్రాఫిక్ వినాయకుడిని దర్శించుకున్న కలెక్టర్, ఎస్పీ!

Kamareddy: కామారెడ్డి పట్టణంలోని ఇంద్ర చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ వినాయకుడిని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వినాయక చవితి వేడుకలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.

ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ట్రాఫిక్ గణపతి ఏర్పాటు ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

వినాయక చవితి సందర్భంగా భక్తులు భద్రతా నిబంధనలు పాటిస్తూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని అధికారులు సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి, డీఎస్పీ మధుసూదన్, సీఐలు నరహరి, సంతోష్, ఎస్సై చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY