Nizamsagar: నిజాంసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Nizamsagar: బాన్సువాడ ఆర్డీఓతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్. ఖరీఫ్ సీజన్ సాగునీటి విడుదల, నీటి నిల్వలపై అధికారులతో సమీక్ష.
Nizamsagar: నిజాంసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
నిజాంసాగర్: జుక్కల్ నియోజకవర్గం లోని నిజాంసాగర్ ప్రాజెక్టు ను గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ బాన్సువాడ ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి తో కలిసి సందర్శించారు.
సందర్శన లో భాగంగా ప్రాజెక్ట్ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ లో ప్రస్తుతం ఉన్న నీటి మట్టం,అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, ఖరీఫ్ సీజన్ కు సాగునీటి విడుదల ప్రణాళిక, ఆయకట్టు రైతులకు నీటి సరఫరా తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రాజెక్ట్ లోని వివిధ భాగాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నిర్వహణ పనులు, గేట్ల స్థితి, నీటి విడుదల కు చేపడుతున్న ఏర్పాట్ల గురించి అధికారులతో చర్చించారు.
కార్యక్రమం లో నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి పారుదల శాఖ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతోపాటు ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.




