Banswada: జిల్లాలో మొదటి స్పెషల్ రైస్ కౌంటర్ ప్రారంభించిన కలెక్టర్!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ తిరుమల రైస్ షాప్‌లో గురువారం జిల్లాలోనే మొదటి స్పెషల్ రైస్ కౌంటర్‌ను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రారంభించారు.

SALEEM, BANSWADA
Published on: 19 Nov 2026 6:19 PM IST
Banswada
X

Banswada: జిల్లాలో మొదటి స్పెషల్ రైస్ కౌంటర్ ప్రారంభించిన కలెక్టర్!

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లాలో తొలిసారిగా బాన్సువాడ లో స్పెషల్ రైస్ కౌంటర్ ను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రారంభించారు.పెరుగుతున్న బియ్యం ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వo ప్రత్యేక చర్యలు తీసుకుంది. సామాన్యులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం దొరికేటట్టు రైస్ కౌంటర్ ను ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ప్రారంభించే విధంగ చర్యలు చేపట్టింది.

తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఆదేశించిన ధరలకే ప్రజలకు బియ్యం అందించాలనే లక్ష్యంతో కామారెడ్డి జిల్లాలో తొలిసారిగా బాన్సువాడ పట్టణంలోని తిరుమల రైస్ షాప్‌లో ప్రత్యేక రైస్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు.

రైస్ మిల్లరు వ్యాపారవేత్త నాగులగమ వెంకన్న ఈ రైస్ కౌంటర్ ను పెట్టారు.రాష్ట్ర ప్రభుత్వం రానున్న ఎల్ నినో ను దృష్టి లో పెట్టుకొని మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ప్రజలకు తక్కువ ధరలకే బియ్యం అందుబాటులోకి తీసుకురావడం కోసం ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కోరారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు బియ్యం అమ్మడానికి ముందుకు వచ్చి,వారికి సహకరించి,జిల్లాలోనే మొట్టమొదటి దుకాణం ప్రారంభించి నందుకు కలెక్టర్ నాగులగామ వెంకన్న సెట్ ను అభినందించారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA