Banswada: ఎన్నికల అధికారి తీరుకు నిరసనగా కోటగిరి బస్టాండ్ వద్ద ఆందోళన!

Banswada: భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ రేపు కోటగిరి బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టనున్నారు.

SALEEM, BANSWADA
Published on: 5 Oct 2026 11:09 PM IST
Banswada
X

Banswada: ఎన్నికల అధికారి తీరుకు నిరసనగా కోటగిరి బస్టాండ్ వద్ద ఆందోళన!

Banswada: భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ, కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రేపు మంగళవారo ఉదయం 10:00 గంటలకు, కోటగిరి బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టే ధర్నాకు భారీ సంఖ్యలో తరలి రావాలని, పార్టీ మండల అధ్యక్షులు షాహిద్ హుస్సేన్ తెలిపారు.

కోటగిరి మండల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, ఏఎంసీ చైర్మన్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామాల ప్రజలు, మిత్రులందరూ ఈ ధర్నాకు తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు షాహిద్ హుస్సేన్ కోరారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA