Dichpally: డిచ్‌పల్లిలో లబ్ధిదారులకు అందజేసిన CMRF చెక్కులు
Dichpally: నిజామాబాద్ జిల్లా ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం పంపిణీ చేశారు.
Dichpally: డిచ్‌పల్లిలో లబ్ధిదారులకు అందజేసిన CMRF చెక్కులు
డిచిపల్లి: ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్స చేయించుకోలేని స్థితిలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అండగ నిలుస్తోందని ఖిల్లా డిచ్ పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.
అదివారం ఖిల్లా డిచ్ పల్లి గ్రామం లో లబ్ధిదారులకు సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం సి ఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ తో లబ్ధిదారులకు భరోసా కల్పిస్తుందని అన్నారు.పేద,మధ్య తరగతి కుటుంబాలు వైద్య చికిత్సల కోసం అప్పుల పాలవ్వకుండా ఉండేందుకు సి ఎం ఆర్ ఎఫ్ పథకం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం వారి వెన్నంటి ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ద్వార మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసి వారి కుటుంబాలకు త్వరితగతిన ఆరోగ్య ప్రయోజనాలు అందాలని ఆకాంక్షించారు.
కార్యక్రమం లో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శేరు లింగం, భూస సుదర్శన్, దాసరి అశోక్, AG దాస్,ఆకుతోట సుమన్, జంగం శాంతయ్య, సుమన్,ఆసది జితేందర్, దువ్వ నర్సింగ్, రాజారెడ్డి,గంగాదాసు,రాజు,దేవిదాస్,హరికిషన్, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.




