Varni: ప్రధాన ఎన్నికల అధికారి తీరుకు వ్యతిరేకంగా వర్నిలో రేపు మహాధర్నా!
Varni: భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వర్నిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నారు.
Varni: ప్రధాన ఎన్నికల అధికారి తీరుకు వ్యతిరేకంగా వర్నిలో రేపు మహాధర్నా!
వర్ని: వర్ని మండల కేంద్రం లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం,మంగళవారం ఉదయం చేపట్టనున్నట్లు,వర్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ బాబా తెలిపారు. భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దల పిలుపు మేరకు 10:00 గంటలకు,ధర్నా నిర్వహించ నున్నట్లు surah బాబా తెలిపారు.
ఈ కార్యక్రమానికి గౌరవ ఉమ్మడి వర్ని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉపసర్పంచులు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,ఈ ధర్నాకు తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా వర్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ బాబా విజ్ఞప్తి చేశారు.




