Madnoor: మద్నూర్‌లో కూల్ డ్రింక్స్ వాహనం బోల్తా.. జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా పానీయాల బాటిళ్లు!

Madnoor: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం రుషేగావ్ వద్ద జాతీయ రహదారి 161పై కూల్ డ్రింక్స్ వాహనం బోల్తా పడింది.

VEERANNA, JUKKAL
Published on: 10 May 2026 9:22 PM IST
Madnoor
X

Madnoor: మద్నూర్‌లో కూల్ డ్రింక్స్ వాహనం బోల్తా.. జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా పానీయాల బాటిళ్లు!

మద్నూర్ (కామారెడ్డి): మద్నూర్ (కామారెడ్డి) వేసవి తాపం నుండి కాస్త ఉపశమనం కల్పించేందుకు గాను రోజు లాగే శీతల పానీయాలు సరఫరా చేసే వాహనం టైర్ పేలి వాహనం బోల్తా పడ్డ ఘటన మద్నూర్ మండలం లో చోటు చేసుకుంది. మద్నూర్ మండలం రుషేగావ్ 161 జాతీయ రహదారిపై మద్నూర్ మండల కేంద్రంలో వివిధ దుకాణాల్లో తంసఫ్, స్ప్రైట్, పాల్పి ఆరెంజ్ లాంటి కూల్ డ్రింక్స్ సరఫరా చేసిన వాహనం అక్కడినుండి బయలుదేరి బిచ్కుంద కు వెళ్తున్న క్రమంలో రూసెగావ్ గేట్ 161 జాతీయ రహదారిపై ఒక్కసారిగ వాహనం టైర్ పేలి పోవడంతో వాహనం లో ఉన్న కూల్ డ్రింక్స్ అన్ని జాతీయ రహదారి పై చెల్లాచెదురుగా పడిపోయాయి.

ఇందులో చాలా వరకు ధ్వంసమయ్యాయి. దీంతో కాసేపు జాతీయ రహదారి పై వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. విషయం తెలుసుకున్న మద్నూర్ పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని డ్రైవర్ ను చికిత్స కోసం మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చెల్ల చెదురైన కూల్ డ్రింక్స్ లను రహదారి పై నుండి తొలగించడంతో యధావిధిగా వాహనలరకపొకలు ప్రారంభమయ్యాయి. అనంతరం కూల్ డ్రింక్స్ ఏజెన్సీ యాజమాన్యం ఘటన స్థలాన్నిచేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాహన డ్రైవర్ మద్నూర్ కు చెందిన సురేష్ తోపాటు అతని బాబాయి లు ఇద్దరు స్వల్ప గాయాలతో బయట పడ్డారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story