Bodhan: బోధన్‌లో వడదెబ్బతో కూలీ మృతి.. ఎండల హెచ్చరిక

Bodhan: నిజామాబాద్ బోధన్‌లో వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి. ఎండలపై అవగాహన లేకపోవడంపై విమర్శలు.

K RAVI, BODHAN
Updated on: 21 April 2026 11:09 AM IST
Bodhan
X

Bodhan: బోధన్‌లో వడదెబ్బతో కూలీ మృతి.. ఎండల హెచ్చరిక

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఏరాజ్‌పల్లి గ్రామంలో వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ఎరుకలి నర్సయ్య (51) గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులకు వెళ్లాడు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో నర్సయ్యకు తీవ్ర దాహం ఏర్పడింది. నీళ్లు తాగిన అనంతరం ఆయన అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్థానికులు వైద్య సిబ్బందికి సమాచారం అందించి, ప్రాథమిక చికిత్స అందించి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే నర్సయ్య మృతి చెందినట్లు సమాచారం.

ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు, ముఖ్యంగా కూలీలకు తగిన అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వడగాల్పుల ప్రభావం నుంచి రక్షణ కోసం ప్రజలకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story