Kamareddy: అమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్!

Kamareddy: బాన్సువాడలో అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘం నాయకులు ఎస్ హెచ్‌ఓకు ఫిర్యాదు చేశారు.

SALEEM, BANSWADA
Published on: 14 Sept 2026 12:41 PM IST
Kamareddy
X

Kamareddy: అమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్!

Kamareddy: భారత రాజ్యాంగ రచయిత,డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి,అంబేద్కర్ ను అవమాన పరిచిన అమారా ప్రసాద్ పై కేసు నమోదు చేయాలని ఈ రోజు బాన్సువాడ ఎస్ హెచ్ ఓ తుల శ్రీధర్ కు దళిత సంఘం నాయకులు నేరే నర్సింలు ఆధ్వర్యంలో దరఖాసు ను అందజేశారు.అమారా ప్రసాద్ ను వెంటనే అరెస్టు చెయ్యాలని,ఆయన పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బోర్లం గ్రామ సర్పంచ్ రమేష్,మన్నే చిన్న సాయిలు,దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA