Kamareddy: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. పొంచి ఉన్న పెను ప్రమాదం!

Kamareddy: కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం హసన్ టాక్లి గ్రామంలో ఇండ్ల పైనుంచి వేలాడుతున్న విద్యుత్ తీగలతో ప్రజల భయం. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం.

VEERANNA, JUKKAL
Published on: 30 May 2026 12:54 PM IST
Kamareddy
X

Kamareddy: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. పొంచి ఉన్న పెను ప్రమాదం!

Kamareddy: హసన్ టాక్లి (కామారెడ్డి) ఇంటిపై ప్రమాదపు అంచులో వేలాడుతున్న విద్యుత్ తీగతో భయాందోళనకు గురవుతున్న ప్రజల ఇబ్బందులు పట్టించుకొని స్థితి డోంగ్లి మండలం హసన్ టాక్లి లో దాపురించింది. డోంగ్లి మండలం హసన్ టాక్లి గ్రామంలో నివాసముండే ఇండ్లపై విద్యుత్ తీగలు రెండు ఒకే చోట కలవడంతో ఈదురు గాలుల కారణంగా ఒక్కసారిగా ఆ తీగలు రెండు ఒకే చోట కలిసిపోయి ప్రమాదం జరిగే పరిస్థితి నెలకొందని గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల తడి హిప్పర్గ గ్రామంలో విద్యుత్ నియంత్రికపై ఎక్కి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందిన ఘటన అందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ సంబంధిత విద్యుత్ శాఖ సిబ్బంది ప్రమాద పరిస్థితి లో విద్యుత్ తీగలను సరిచేయడంలో నిర్లక్ష్యం చేస్తుండడంతో ఎప్పుడు ఎ ప్రమాదం వాటిల్లుతుందో తెలియక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైన విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ తీగలను సరి చేసి ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story