Kamareddy: రైతులకు అండగ కాంగ్రెస్ ప్రభుత్వం డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

Kamareddy: కామారెడ్డి జిల్లా మంగళూరులో జొన్న కొనుగోలు కేంద్రాన్ని డీసీసీ అధ్యక్షుడు ప్రారంభించారు.

VEERANNA, JUKKAL
Published on: 23 May 2026 11:31 AM IST
Kamareddy
X

Kamareddy: రైతులకు అండగ కాంగ్రెస్ ప్రభుత్వం డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

కామారెడ్డి: రైతులకు అండగ కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలం మంగళూరు గ్రామంలో జొన్న రైతులకు ఊరటనిచ్చే విధంగ జొన్న కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.

అనంతరం ఆయన రైతులనుదేశించి మాట్లాడుతూ అన్నదాతలు పండించిన జొన్నలకు ప్రభుత్వం ద్వార సరైన గిట్టుబాటు ధర అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను కొనుగోలు కేంద్రాల ద్వార పారదర్శకంగా జొన్న, ధాన్యం సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతా రైతులకు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమం లో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరి, బిచ్కుంద మండల అధ్యక్షుడు మున్నూరు. నాగ్ నాథ్, మంగళూరు గ్రామ అధ్యక్షుడు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story