Nizamabad: డిచ్‌పల్లి బీసీ హాస్టల్ వార్డెన్‌ను తొలగించాలి: పీడీఎస్‌యూ!
Nizamabad: ప్రభుత్వ జూనియర్ కళాశాల బీసీ హాస్టల్ వార్డెన్‌ను వెంటనే తొలగించాలని పీడీఎస్‌యూ మాజీ ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రజావాణిలో విద్యార్థులు ఫిర్యాదు చేశారు
Nizamabad: డిచ్‌పల్లి బీసీ హాస్టల్ వార్డెన్‌ను తొలగించాలి: పీడీఎస్‌యూ!
నిజామాబాద్: మవారం ప్రజావాణిలో డిచ్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల బీసీ హాస్టల్ వార్డెన్ ని తొలగించాలని మాజీ PDSU జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్, విద్యార్థులతో కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వాసరి సాయినాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల BC హాస్టల్ లొ వార్డెన్ అంజు మేడం విద్యార్థులకు పురుగుల అన్నం, బల్లి పడ్డ అన్నం తిని చాలా మంది విద్యార్థులకు శరీరం పైన దురదలు, వాంతులు జరిగాయి,హాస్టల్ లొ కూరగాయలు కూడ కుళ్ళిపోయినవి పెట్టడం, చింత చారుతో అన్నం పెట్టడం, మెనూ ప్రకారం ఫుడ్ పెట్టడం లేదు. కరీస్ బాగాలేదు అని మేడం కి చెప్పితే TC తీసుకోని వెళ్ళిపో అని బెదిరించడం చేస్తుంది.
అని విద్యార్థులు తెలియజేశారు.విద్యార్థులఆరోగ్యం తో ఆటలాడుతున్న వార్డెన్ మేడం ని తొలగించాలని PDSU డిమాండ్ చేస్తుంది. హాస్టల్ భవనం లోకి పెద్ద ఎలుకలు వస్తున్నాయి అని సాయినాథ్ అన్నారు. చదవాలంటే మొదలు ఆరోగ్యంగా ఉండాలి. కాని ఈ హాస్టలో ఫుడ్ బాగాలేక అనారోగ్యనికి గురవుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకోని విద్యార్థులకు పర్మనెంట్ హాస్టల్ భవనం నిర్మించాలని చేశాను విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమం లొ 30 మంది హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.




