Desaipet: దేశాయిపేట్ హనుమాన్ ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం
Desaipet: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్ హనుమాన్ ఆలయంలో కార్తీక పౌర్ణమి దీపోత్సవం; దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేసిన భక్తులు.
Desaipet: దేశాయిపేట్ హనుమాన్ ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం
దేశాయిపేట్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు. హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




