Dichpally: డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
Dichpally: డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించి నివాళులర్పించిన ఎస్సై ఆరిఫ్. పాల్గొన్న పోలీస్ సిబ్బంది.
Dichpally: డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
డిచ్ పల్లి: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఘనంగా జాతీయ జెండా ను ఎస్. ఐ ఆరిఫ్ ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎస్. ఐ మాట్లాడుతూ దేశభక్తి, జాతీయ సమైక్యత, ప్రజాసేవ అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని అన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను కొనసాగిస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్. ఐ ఆరిఫ్, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Next Story




