Dichpally: మీ ఊరి భద్రత మీ చేతుల్లోనే.. డిచ్‌పల్లి ఎస్ఐ కీలక వ్యాఖ్యలు!

Dichpally: డిచ్‌పల్లిలో పోలీసుల అవగాహన సదస్సు. మహిళల భద్రత, సైబర్ క్రైమ్, రోడ్డు భద్రతపై ఎస్ఐ సుమన రెడ్డి సూచనలు.

M. RAMESH,NIZAMABAD
Published on: 8 May 2026 12:56 PM IST
Dichpally
X

Dichpally: మీ ఊరి భద్రత మీ చేతుల్లోనే.. డిచ్‌పల్లి ఎస్ఐ కీలక వ్యాఖ్యలు!

Dichpally: “మన ఊరు – మన భద్రత – మన బాధ్యత” కార్యక్రమం భాగంగా డిచ్ పల్లి పోలీస్ వారు ఎస్ ఐ సుమన రెడ్డి ఆధ్వర్యంలో ఖిల్లా డిచ్ పల్లి గ్రామంలో అవగాహన సమావేశం నిర్వహించరు ఎస్.ఐ సుమన రెడ్డి ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మహిళల భద్రత, సైబర్ భద్రత, రోడ్డు భద్రత,ఆస్తి సంబంధిత నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పించబడింది. మహిళల భద్రతపై ప్రత్యేకంగా చర్చిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ఎవరిని సంప్రదించాలి అనే అంశాలపై సూచనలు ఇవ్వబడినవి. సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలనీ, అనుమానాస్పద లింకులు లేదా కాల్స్‌కు స్పందించవద్దని తెలియజేశారు.

రోడ్డు భద్రతపై మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగం అవసరమని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై అప్రమత్తంగా ఉండడం గురించి వివరించారు.గ్రామంలో వీలైతే ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇది గ్రామ భద్రతను మరింత బలోపేతం చేయడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని,తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లోక్కిడి యాదగిరి, ఎస్.ఐ సుమనా రెడ్డి, రామాలయ ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య, ఎ ఎస్ ఐ రియాద్.గ్రామ పంచాయతీ కార్యదర్శి వినయ్, విడిసి రైటర్ రవీందర్, క్యాషియర్ రాజారెడ్డి, వార్డు సభ్యులు సుమన్, రమేష్, కొప్పుల పోశెట్టి, దాస్,గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story