Bichkunda: బిచ్కుందలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీ ముగింపు
Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 51 జట్లతో 15 రోజుల పాటు సాగిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో కొత్తబాది జట్టు విజేతగా నిలిచి రూ.40 వేల ప్రైజ్‌మనీ గెలుచుకుంది.
Bichkunda: బిచ్కుందలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీ ముగింపు
బిచ్కుంద(కామారెడ్డి): బిచ్కుంద పాలగుండం వద్ద గల గ్రౌండ్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జుక్కల్ ఇన్చార్జి జాదవ్ ఈశ్వర్ నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ 15 రోజులపాటు అట్టహాసంగా కొనసాగింది. టోర్నమెంట్లో మొత్తం 51 జట్లు పాల్గొని హోరాహోరీగా తలపడ్డాయి.
చివరిమ్యాచ్లోమొహమ్మద్ నగర్ మండలం కొత్తబాది జట్టు మేనేజ్మెంట్ జట్టుపై ఉత్కంఠభరిత పోరు మధ్య విజయం సాధించి విజేతగా నిలిచింది. విజేత జట్టుకు రూ.40 వేల ప్రైజ్‌మనీ, కప్ అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.20 వేలప్రైజ్మనీఅందించారు.చివరిమ్యాచ్ను బిచ్కుంద ఏఎస్సై డి.దేవరావ్ టాస్ వేసి ప్రారంభించారు.
మ్యాచ్ లో పాల్గొని గెలుపొందిన విజేతలకు తెలంగాణ రాజ్యాధికార (టీఆర్పీ) పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహెర్, జుక్కల్ ఇన్చార్జి జాదవ్ ఈశ్వర్, జుక్కల్ నియోజకవర్గం అధ్యక్షుడు వాగ్మరే ఖండేరావు,మైనార్టీ నాయకుడు పాషా సెట్ ల చేతుల మీదుగా ప్రైజ్‌మనీ, కప్‌ను అందజేశారు.
టి ఆర్ పి పార్టీ ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా నిర్వహించిన టోర్నమెంట్ విజయవంతంగానిర్వహించడంపైక్రీడాకారులు,నిర్వాహకులనుపలువురుఅభినందించారు.చివరి మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులుపాలగుండం గ్రౌండ్‌కు తరలివచ్చారు.




