Kamareddy: కామారెడ్డిలో కాంగ్రెస్ సేవాదళ్ ప్రెస్ మీట్!
Kamareddy: సేవాదళ్ ద్వారా నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని జిల్లా అధ్యక్షుడు గడ్డమీది మహేష్ తెలిపారు.
Kamareddy: కామారెడ్డిలో కాంగ్రెస్ సేవాదళ్ ప్రెస్ మీట్!
Kamareddy: సేవాదళ్ ద్వారా సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉంటామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది మహేష్ అన్నారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలో ఆయన ఇటీవల నియమించబడిన నూతన మండల అధ్యక్షులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షునిగా నియమించిన సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క, జిల్లా ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంత్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, టిపిసిసి జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షుడి సూచనతో జిల్లాలో నియోజకవర్గాలు, మండలాల అధ్యక్షులను నియమించి నియామక పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తమవంతు కృషి చేస్తామన్నారు. ప్రతి గ్రామం, మండలాల్లో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రభుత్వ, పార్టీ సంక్షేమ పథకాల అమలుకు కృషి చేయడంతో పాటు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కామారెడ్డి నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షుడు మెహెర్ బాబాగౌడ్, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఒడ్డె సుదర్శన్, రూరల్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, రాజంపేట అధ్యక్షుడు వేణుగోపాల్ చారి, దోమకొండ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ గౌడ్, బిక్కనూర్ అధ్యక్షుడు మాధవ రెడ్డి, పాల్వంచ అధ్యక్షుడు వడ్ల హరీష్, మాచారెడ్డి అధ్యక్షుడు మహేష్ పాల్గొన్నారు.




