Ditchpally: జాతీయ సాఫ్ట్‌బాల్‌లో కాంస్య పతకం సాధించిన నిజామాబాద్ విద్యార్థినులు!
Ditchpally: 39వ సబ్‌జూనియర్ జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన డిచ్‌పల్లి సుద్ధపల్లి గురుకుల పాఠశాల విద్యార్థినులను అభినందించిన ప్రిన్సిపల్ నళిని.
Ditchpally: జాతీయ సాఫ్ట్‌బాల్‌లో కాంస్య పతకం సాధించిన నిజామాబాద్ విద్యార్థినులు!
Ditchpally: డిచ్‌పల్లి మండలం సుద్ధపల్లి సాంఘిక సంక్షేమ పాఠశాలకు చెందిన విద్యార్థినులు జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ప్రతిభ చాటారు. ఔరంగాబాద్‌లో జరిగిన 39వ సబ్‌జూనియర్ జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించడంలో విద్యార్థినులు కీలక పాత్ర పోషించారు. కాంస్య పతకంతో పాఠశాలకు చేరుకున్న క్రీడాకారిణులను ప్రిన్సిపల్ నళిని శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రిన్సిపల్ స్వప్న, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ వనిత, ఉపాధ్యాయులు నర్మద, ఓస జోష్ణ, సాఫ్ట్‌బాల్ కోచ్ మౌనిక తదితరులు పాల్గొన్నారు.




