Nandipet: వరి సాగులో ఖర్చులు తగ్గించుకునేలా డ్రం సీడర్స్ పంపిణీ!

Nandipet: చిమ్రాజ్‌పల్లిలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రం సీడర్స్ పంపిణీ చేశారు. వరి సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

VAMSHI, ARMOOR
Published on: 14 July 2026 4:28 PM IST
Nandipet
X

Nandipet: వరి సాగులో ఖర్చులు తగ్గించుకునేలా డ్రం సీడర్స్ పంపిణీ!

నందిపేట్ న్యూస్ : జిల్లా కేంద్ర నందిపేట్ మండలం చిమ్రాజ్‌పల్లి గ్రామంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నలుగురు లీడ్ ఫార్మర్స్‌కు డ్రం సీడర్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని రైతులకు ఈ డ్రం సీడర్స్ అందుబాటులో ఉంచి, ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

డ్రం సీడర్స్ వినియోగం ద్వారా వరి సాగులో విత్తనాల వినియోగం తగ్గడంతో పాటు కూలీల కొరత సమస్యను అధిగమించవచ్చని, సాగు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా సమాన దూరంలో విత్తనాలు పడడం వల్ల పంట ఎదుగుదల మెరుగుపడి అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిమ్రాజ్‌పల్లి గ్రామ సర్పంచ్ శ్రీమతి లావణ్య–మురళి, ఉపసర్పంచ్ శ్రీ నరేందర్, చిమ్రాజ్‌పల్లి సహకార సంఘం చైర్మన్ శ్రీ బొంకం గంగారెడ్డి, ఏఈఓ మౌనిక మేడం, తల్వేద గ్రామ సర్పంచ్ శ్రీకాంత్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సిఎఫ్ రాజేష్, జెసిఎఫ్ సాగర్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

VAMSHI, ARMOOR

VAMSHI, ARMOOR

Next Story