Baswapur: బస్వాపూర్‌లో తాగునీటి సరఫరాపై సమీక్షా సమావేశం!
Baswapur: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామపంచాయతీలో మిషన్ భగీరథ ఏఈ రాచప్ప ఆధ్వర్యంలో తాగునీటి సరఫరా, మోటార్ల పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
Baswapur: బస్వాపూర్‌లో తాగునీటి సరఫరాపై సమీక్షా సమావేశం!
బస్వాపూర్: జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామంలో తాగునీటి సరఫరాపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆర్ డబ్ల్యూ ఎస్,మిషన్ భగీరథ ఏ ఈ రాచప్ప ఆధ్వర్యంలో గ్రామ పాలకవర్గ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా పరిస్థితిపై చర్చించారు.
గ్రామంలో ఉన్న మూడు వాటర్ ట్యాంకులు, 5 హెచ్‌పీ సామర్థ్యం గల రెండు మోటార్లు, ఏడు సింగిల్‌ఫేజ్ మోటార్ల పనితీరును సమీక్షించారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా ఇళ్లకు అందుతున్న తాగునీటి నల్లా కనెక్షన్ల వివరాలు, గ్రామంలో తాగునీటి సరఫరాకు సంబంధించిన సమస్యలపై పాలకవర్గ సభ్యులతో చర్చించారు.
సమావేశంలో గ్రామ సర్పంచ్ వి.రమణ సురేష్, ఉప సర్పంచ్ బి. అనిల్ కుమార్,గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఎం.సంగ్రామ్,కె. మల్లుగొండ, షాదుల్, నాగనాథ్, హైదర్ సాబ్, గ్రామపంచాయతీ కార్యదర్శి భారద్వాజ్, అంగన్‌వాడీ టీచర్ భాగ్యలక్ష్మి, ఆశా కార్యకర్త డి.నాగమణి, ఫీల్డ్ అసిస్టెంట్ బి.రాజు, కారోబార్ ఎం.గంగారం, వాటర్‌మన్ బి.వీరేశం, స్వీపర్ యశ్వంత్, మిషన్ భగీరథ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




