Kamareddy: కామారెడ్డిలో 15 కేజీల డ్రై ఫ్రూట్స్‌తో వినూత్న మట్టి వినాయకుడు!

Kamareddy: కామారెడ్డి పెద్దమ్మ గల్లిలో 15 కేజీల డ్రై ఫ్రూట్స్‌తో రూపొందించిన మట్టి వినాయకుడు, ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ఠాపన. భారీగా తరలివచ్చి పూజలు చేస్తున్న భక్తులు.

MADHU, KAMAREDDY
Published on: 17 Sept 2026 5:43 PM IST
Kamareddy
X

Kamareddy: కామారెడ్డిలో 15 కేజీల డ్రై ఫ్రూట్స్‌తో వినూత్న మట్టి వినాయకుడు!

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్దమ్మ గల్లి శివ వినాయక హిందూ యూత్ ఆధ్వర్యంలో 37వ వార్షికోత్సవం సందర్భంగా వినూత్న మట్టి వినాయకుని ఏర్పాటు చేశారు. ఐడియా ఉంది అనంతరం నిర్వాహకులు అధ్యక్షుడు నల్లమడుగు రాజు, సభ్యులు మాట్లాడుతూ గత 37 సంవత్సరాలుగా ప్రతిసారి ఏదో ఒక వినూత్న ఆలోచనతో మట్టి వినాయకుని పూజించడం జరుగుతుందని దాంతో భారీ సంఖ్యలో మహిళలు భక్తులు అక్కడికి వచ్చి పూజలు చేస్తున్నారని తెలిపారు.

ఈసారి మట్టి వినాయక ఏర్పాట్లలో భాగంగా సుమారు 15 కేజీల బాదం,కాజు, డ్రై ఫ్రూట్స్ తో వినాయకునికి తయారు చేశారు. అదేవిధంగా సుమారు భారతదేశంలోని జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేశారు. వినాయకుని దర్శనానికి వచ్చిన భక్తులు, భారీ సంఖ్యలో పూజలు పాల్గొనడానికి వచ్చే భక్తులు జ్యోతిర్లింగాలకు మంచి నీటితో భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తున్నారు.

వినాయకుడి పూజలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో శివ వినాయక హిందూ యూత్ గౌరవ అధ్యక్షులు పిల్లి మల్లేష్ , కిషన్, ప్రభాకర్, తేలు శ్రీనివాస్, అధ్యక్షుడు నల్లమడుగు రాజు, ఉపాధ్యక్షుడు అంజన్ కుమార్, క్యాషియర్ తూర్పు హరిప్రసాద్, తూర్పు శ్రీనివాస్, చింతల నిఖిల్, పిల్లి సాయి, అనిల్, నవీన్ కుమార్, శివ, స్వామి, పిల్లి లింగం, తూర్పు లింగం, తూర్పు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY