Banswada: బీర్కూర్‌లో ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య వేడుకలు!
Banswada: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఎడ్ల పొలాల అమావాస్య పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి.
Banswada: బీర్కూర్‌లో ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య వేడుకలు!
Banswada: వ్యవసాయానికి, రైతు జీవితానికి వెన్నుముకగా నిలిచే ఎడ్లను పూజించే ఈ పండుగను గ్రామీణులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయాన్నే రైతులు తమ ఎడ్లను రంగురంగుల పూలు, నెమలి ఈకలతో అందంగా అలంకరించారు. గ్రామ వీధుల్లో ఎడ్లను ఊరేగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పంటలు సమృద్ధిగా పండి, గ్రామం సుభిక్షంగా ఉండాలని నైవేద్యాలు సమర్పించారు.గ్రామ సర్పంచ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మ తేజ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకోవడంలో ఎడ్ల పొలాల పండుగ కీలకమని, కష్టపడి పనిచేసే పశువులను దైవంగా భావించడం మన గొప్పతనమని పేర్కొన్నారు. రైతులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వేడుకల్లో ఉప సర్పంచ్ పరమేష్ పంతులు, నాయకులు మేకల రాములు, గొల్ల సాయిలు, సిగని విఠల్, గొల్ల దేవదాస్, మేకల నవీన్ లతో పాటు గ్రామ పెద్దలు, యువకులు, రైతులు పాల్గొన్నారు.




