Bodhan: సిద్దాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు కిందపడి వృద్ధురాలికి తీవ్ర గాయాలు!
Bodhan: బోధన్ మండలం సిద్దాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద పడి శేషుబాయి (54) అనే వృద్ధురాలికి తీవ్ర గాయాలు.
Bodhan: సిద్దాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు కిందపడి వృద్ధురాలికి తీవ్ర గాయాలు!
Bodhan: బోధన్ మండలం సిద్దాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు కిందపడి శేషు బాయ్ 54 వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. బికినీలి నుండి బోధన్ వైపు tg 16 z0060 నంబర్ గల బస్సు బికనెల్లి నుండి కండుగా మీదుగా సిద్దాపూర్ వచ్చింది. బస్సులో ఉన్న వృద్ధురాలు సిద్దాపూర్ లో దిగేందుకు ఫుట్ పాత్ పై వచ్చి ఉన్నప్పటికీ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సులు ముందు తీసుకోవడంతో వెనుక చక్రాల కింద పడి వృద్ధురాలికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ ప్రమాదంలో రెండు కాళ్లు పూర్తిగా విరిగిపోయి పరిస్థితి విషమంగా మారడంతో స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ అజాగ్రత్తగా వ్యవహరించడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు.
డ్రైవర్ తో పాటు కండక్టర్ సైతం నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించడంతో వృద్ధురాలికి ప్రమాదం చోటుచేసుకుందని సిద్దాపూర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ కండక్టర్ ల పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కుటుంబ సభ్యులు బంధువులు డిమాండ్ చేశారు.




