Dichpally: డిచ్‌పల్లి మండలంలో శోకసతప్త కుటుంబాలను పరామర్శించిన నాయకులు!
Dichpally: డిచ్‌పల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ పరామర్శించారు.
Dichpally: డిచ్‌పల్లి మండలంలో శోకసతప్త కుటుంబాలను పరామర్శించిన నాయకులు!
Dichpally: డిచ్‌పల్లి మండలంలోని రాంపూర్, ధర్మారం (బి), సుద్దులం గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలువురు కుటుంబాలను శనివారం రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వి. గంగాధర్ గౌడ్ పరామర్శించారు.రాంపూర్‌కు చెందిన బక్క రామన్న, బీఆర్‌ఎస్ నాయకుడు బక్క రాములన్న, అజయ్ తండ్రి మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి మృతికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అజయ్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు భరోసా ఇచ్చారు.వారి వెంట పాపాయి తిరుపతి, కాయితీ రాజ్‌కుమార్, ఒడ్డెం నరసయ్య, నీరడి పద్మారావు, నల్లవెల్లి సాయిలు, కర్రెమోల్ల సుమన్, బండారు గణేష్, ప్రశాంత్, రమేష్ గౌడ్, ఇర్ల ఆశన్న, ఆసాది ప్రమోద్, సూర నరేష్ తదితరులు ఉన్నారు.




