Jukkal: మృతిచెందిన బిఆర్ఎస్ నాయకుడు బన్నీ కుటుంబాన్ని పరామర్శించిన షిండే!

Jukkal: జుక్కల్ మండలం మతురా తాండాలో అనారోగ్యంతో మృతిచెందిన బిఆర్ఎస్ నాయకుడు బన్నీ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శించి భరోసా కల్పించారు.

VEERANNA, JUKKAL
Published on: 2 Nov 2026 1:35 PM IST
Jukkal
X

Jukkal: మృతిచెందిన బిఆర్ఎస్ నాయకుడు బన్నీ కుటుంబాన్ని పరామర్శించిన షిండే!

Jukkal: మతురా తాండ (కామారెడ్డి ) బి ఆర్ ఎస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేసి ఎందరికో ఆదర్శంగా నిలబడి ఇటీవలే అనారోగ్యం కారణంగా మృతి చెందిన బన్నీ కుటుంబానికి జుక్కల్ మాజి ఎమ్మెల్యే హన్మంత్ షిండే భరోసా కల్పించారు.

ఈ సందర్బంగా జుక్కల్ మండలం డోన్ గావ్ గ్రామ పంచాయతీ లొని మతురా తాండ కు బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి బన్నీ నివాసనికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

బన్నీ పార్టీ కార్యక్రమాల్లో తమ దైన చురుకుదనాన్ని ప్రదర్శిస్తూ పార్టీ బలోపేతం కోసం ఎందర్నో బి ఆర్ ఎస్ కార్యకర్తలను తయ్యారు చేసిన అలాంటి మంచి నాయకున్ని కోల్పోవడం పార్టీ కి తీరని లోటని ఆ కుటుంబనికి తాము ఎప్పుడు అండగా ఉంటామని కుటుంబనికి ఎలాంటి ఆపద వచ్చిన తమ దృష్టికి తీసుకురావాలని కుటుంబ సభ్యులకు సూచించారు.

కార్యక్రమం లో మాజి సర్పంచ్లు పవర్ కిసాన్, సంజు, శివాజీ పాటిల్, బొల్లి గంగాధర్, జుక్కల్ మాజి ఉప సర్పంచ్ భాను గౌడ్, బి ఆర్ ఎస్ నాయకుడు వష్రె రమేష్ తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL