Kamareddy: రైలులో గంజాయి రవాణా.. మధ్యప్రదేశ్ వ్యక్తి అరెస్ట్!
Kamareddy: కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్, రైల్వే టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో 9 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. మధ్యప్రదేశ్‌కు చెందిన నిందితుడిని అరెస్ట్ చేశారు.
Kamareddy: రైలులో గంజాయి రవాణా.. మధ్యప్రదేశ్ వ్యక్తి అరెస్ట్!
కామారెడ్డి: కామారెడ్డిజిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్ మరియు రైల్వే టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 9 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది. సంబల్‌పూర్ నుంచి నాందేడ్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో గంజాయి రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో అధికారులు స్టేషన్‌లో నిఘా పెట్టారు.
ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేశారు. తనిఖీలో బ్యాగులో 2 కిలోల చొప్పున నాలుగు ప్యాకెట్లు, మరో కిలో ప్యాకెట్ కలిపి మొత్తం 9 కిలోల గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు.
పట్టుబడిన నిందితుడిని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కిషన్ పటేల్‌గా గుర్తించారు. తన స్నేహితుడికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నానని నిందితుడు చెబుతున్నప్పటికీ, విక్రయించేందుకే తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నామని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ తెలిపారు.




