Hasgul: గుంటూరు గ్యాంగ్ గుట్టురట్టు.. కామారెడ్డిలో కిడ్నాప్ ముఠా కలకలం
Hasgul: కామారెడ్డి జిల్లా హస్గుల్ గ్రామంలో నకిలీ ఆశా వర్కర్ల కలకలం.
Hasgul: గుంటూరు గ్యాంగ్ గుట్టురట్టు.. కామారెడ్డిలో కిడ్నాప్ ముఠా కలకలం
హస్గుల్: హాస్గుల్ (కామారెడ్డి) అన్ని రోగాలకు అవసరమైన విరుగుడు మందులు ఇస్తామని చెపుతూ గ్రామ విధులలో మహిళల్ని లోవర్చుకొని నకిలీ మందులు ఇస్తున్న ఆశ వర్కర్ల రూపంలో వచ్చిన మాయ లేడీలను పట్టుకొని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించిన వైనం బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామంలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా అచ్చం పేట నుండి ముగ్గురు మాయలేడిలు నాగలక్ష్మి, నరసమ్మ, కృష్ణ అనే ముగ్గురు మాయలేడిలలో ఒక లేడీ ఆశ వర్కర్ డ్రెస్ ధరించి గ్రామంలోని విధులలో తిరుగుతూ ప్రజల్ని మాయమాటలు చెప్తూ వారి వద్ద నున్న నకిలి మందులను విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్న విషయాన్ని గమనించిన స్థానికులు వారిపై అనుమానం రావడంతో వెంటనే గ్రామ సర్పంచ్,గ్రామస్థులకు సమాచారం చేరవేయడంతో అప్రమత్తమైన గ్రామస్థులు వారిని పట్టుకొని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు గ్రామాన్ని చేరుకొని వారిని అదుపులోకి తీసుకునిబిచ్కుంద పోలీస్ స్టేషన్ కు తరలించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. వీరు చిన్న పిల్లల కిడ్నాప్ చేయడానిక లేక దొంగ తనలకు పాల్పడడానికి వచ్చారానే వివరాలు తెలుసుకుంటున్నారు. ఒక పక్క ఎండ తీవ్రత కారణంగా వేసుకున్న పంటల దిగుబడి సారిగ రాక ప్రజలు అల్లాడిపోతుంటే ఇదే ఆసరాగా తీసుకున్న ఇలాంటి మాయలేడి లు అమాయక ప్రజల ను మోసం చేసేందుకు గ్రామాల మీద పడి మత్తు మాత్రలు, మందులు ఇచ్చి దొంగ తనలకు పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారించి వీరి నుండి సరైన ఆధారాలు రాబట్టి ఇంకెక్కడ ఎన్ని బృందాలు ఉన్నాయనే విషయాలు రాబట్టి ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా చూడాలని పోలీసులను కోరుతున్నారు.




