Pitlam: పిట్లం వద్ద నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్.. వివరాలు వెల్లడించిన డీఎస్పీ

Pitlam: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారం టోల్ గేట్ వద్ద నకిలీ నోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

SALEEM, BANSWADA
Published on: 28 Aug 2026 9:08 PM IST
Pitlam
X

Pitlam: పిట్లం వద్ద నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్.. వివరాలు వెల్లడించిన డీఎస్పీ

పిట్లం: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారం టోల్ గేట్ వద్ద నకిలీ నోట్ల ముఠాను పోలీసులు పట్టుకు న్నట్లు డీ ఎస్ పీ తెలిపారు.హైదరాబాద్ నుండి మహారాష్ట్ర కు వెళ్తుండగా పిట్లం మండల పరిధిలో పెట్రోల్ పంప్లో కారులో ముగ్గురు యువకులు పెట్రోల్ పోసుకుని నకిలీ నోట్ల చెలామణి చేసి వెళ్ళే క్రమంలో నకిలీ నోట్లు అని గుర్తించిన పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై పోలీసులకు సంచారం ఇచ్చారు.

అప్రమత్తమైన పోలీసులు ధర్మారం టోల్ గేట్ వద్ద చాకచక్యం గా, ముగ్గురు మహారాష్ట్రకు చెందిన యువకులు రాహుల్,భీమ్ శంకర్,ప్రతీక్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.హైదరాబాద్ లో ముదస్సర్ హుస్సేన్ అనే వ్యక్తి వద్ద లక్ష ఒరిజినల్ కరెన్సీఇచ్చి 2 లక్షలు నకిలీ నోట్లు తీసుకు వచ్చినట్లు బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ విఠల్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ముదస్సర్ హుస్సేన్ ఫరార్ లో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.ముగ్గురి వద్ద 91 వేల నకిలీ నోట్లు, స్విఫ్ట్ డిజైర్ కారు,3 సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు.మరో వ్యక్తిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA

Next Story