Bodhan: బోధన్‌లో పోలీసులమంటూ వృద్ధురాలి వద్ద భారీ దోపిడీ!

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో పోలీసులమంటూ నమ్మించి వృద్ధురాలి నుంచి ఎనిమిదిన్నర తులాల బంగారం, నగదు దోచుకెళ్లిన దుండగులు, భయాందోళనలో స్థానికులు.

K RAVI, BODHAN
Published on: 6 Oct 2026 12:11 PM IST
Bodhan
X

Bodhan: బోధన్‌లో పోలీసులమంటూ వృద్ధురాలి వద్ద భారీ దోపిడీ!

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో గుర్తు తెలియని దుండగులు పోలీసులమని నమ్మబలకి ఎనిమిదిన్నర తులాల బంగారం 2000 నగదును దోచుకెళ్లిన ఘటన బోధన్ లో సంచలనం రేకెత్తించింది. బోధన్ మండలం సాలంపాడు చెందిన తిరుపతమ్మ అనే వృద్ధురాలు మరో మహిళతో కలిసి టీవీఎస్ మోపెడ్ పై బోధన్లోని ఆసుపత్రికి వెళ్తున్నారు.

పట్టణ శివారులోని బైపాస్ రోడ్డు లో ని రంగారావు దాబా సమీపంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మహిళల వాహనాన్ని ఆపి మేము పోలీసులమని నమ్మించారు. బంగారం ను వెంట పెట్టుకుని రాకూడదని బైపాస్ కు దొంగలు ఉన్నారని దారిదోప్పిడికి పాల్పడుతున్నారని నమ్మించడంతో వృద్ధురాలి మెడలో ఉన్న రెండున్నర తులాల చైన్ 6 తులాల బంగారు గాజులను పర్సులో పెట్టి కవర్లో పెట్టి ఇస్తామని మహిళలను నమ్మించారు.

బాధిత మహిళలకు ఖాళీ కవర్ ఇచ్చి అక్కడ నుండి వ్రాయించిన అనంతరం తిరుపతమ్మ ఆసుపత్రికి చేరుకొని పర్సును గమనించగా పర్స్తోపాటు అందులో ఉన్న బంగారు ఆభరణాలు,రూ 2వేల నగదు సైతం కనిపించకపోవడంతో వృద్ధురాలు అక్కడే కుప్పకూలి పడిపోయింది. వెంటనే బోధన్ పట్టణ పోలీసులకు సమాచారం అందించగా ఎస్హెచ్ఓ వెంకటనారాయణ పోలీసులు బలగాలతో గాలికి చర్యలు చేపట్టారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN