Bodhan: బోధన్ మండలం భూలక్ష్మి క్యాంప్‌లో ట్రైనీ ఐఏఎస్ బృందానికి వీడ్కోలు సభ!
Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం భూలక్ష్మి క్యాంప్‌లో ఐదు రోజుల పాటు పర్యటించిన ట్రైనీ ఐఏఎస్ బృందానికి సర్పంచ్ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో వీడ్కోలు పలికారు.
Bodhan: బోధన్ మండలం భూలక్ష్మి క్యాంప్‌లో ట్రైనీ ఐఏఎస్ బృందానికి వీడ్కోలు సభ!
నిజామాబాద్ జిల్లా: బోధన్ మండలం భూలక్ష్మి క్యాంప్ లో ట్రైనీ ఐ ఏ ఎస్ బృందం కు సర్పంచ్ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈనెల 21 నుండి ఐదు రోజులపాటు గ్రామంలో ట్రైన్ ఐఏఎస్ బృందం పర్యటించి వాళ్ళ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలోని స్థితిగతులు పరిస్థితులపై ఐఏఎస్ బృందం సంతృప్తి వ్యక్తం చేశారు.
భూలక్ష్మి క్యాంపులో పాడి, వ్యవసాయపరంగా అభివృద్ధి చెందారని ఇతర ప్రాంతాల వారికి భూలక్ష్మి క్యాంపు వాసులు ఆదర్శంగా నిలిచారని ఐఏఎస్ బృందం పేర్కొన్నారు. చివరి రోజున శాలువాలు పూలదండలతో సత్కరించి మేలుకోలు సభను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు,గ్రా మస్తులు, పంచాయతీ కార్యదర్శి మహేందర్ సిబ్బంది పోశెట్టి ఉన్నారు.




