Nizamabad: నిజామాబాద్ జిల్లాలో యాప్‌తో ఇబ్బందులు పడుతున్న రైతులు!

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు.

K RAVI, BODHAN
Published on: 20 Aug 2026 12:21 PM IST
Nizamabad
X

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో యాప్‌తో ఇబ్బందులు పడుతున్న రైతులు!

Nizamabad: ఎడపల్లి మండల కేంద్రంలోని సాటాపూర్ గేటు వద్ద రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేశారు. గురువారం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యూరియా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు.

యూరియా యాప్ మూలంగా నిరక్షరాస్యులు అయిన రైతులకు, స్మార్ట్ ఫోన్ లేని రైతులకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయని బిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.

ఎకరాకు నాలుగు బస్తాల యూరియాను అందించడంతోపాటు యాప్ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 40 నిమిషాల పాటు చేసిన రాస్తారోకో చేశారు. భారీగా ట్రాఫిక్ నిలిచి కోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఈ సందర్భంగా ఏడపల్లి మండల బీ ఆర్ఎస్ నాయకులు దుబ్బాక రవీందర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాల మోసం చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను వేధించడంతోపాటు రైతు బీమా పథకం ఎత్తివేసే కుట్ర పన్నుతున్నాడని మండిపడ్డారు.

మాజీ ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు యాప్ ద్వారా తీరని ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి యాప్ ను ఏ త్తివేయాలన్నారు. చిన్న సన్నకర్ రైతులకు సామాన్యులకు ట్యాబ్ ద్వారా ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయన్నారు. ఈ రాస్తారోకోలో ఆకుల శ్రీనివాస్ రైతులు బీ ఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN

Next Story