Kamareddy: ప్రభుత్వం దిగిరావాలి.. పంటను కొనాలి: బిచ్కుందలో రైతుల ఆందోళన
Kamareddy: కామారెడ్డి జిల్లా బిచ్కుందలో రైతుల ఆందోళన. జొన్న, మొక్కజొన్న పంటలను ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా.
Kamareddy: ప్రభుత్వం దిగిరావాలి.. పంటను కొనాలి: బిచ్కుందలో రైతుల ఆందోళన
Kamareddy: బిచ్కుంద (కామారెడ్డి) జొన్న, మొక్క జొన్న పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ రైతులు తహసిల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా కు దిగారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల తహసిల్దార్ కార్యాలయంలో గురువారం చోటు చేసుకుంది. చేతికి వచ్చిన జొన్న,మొక్క జొన్న పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సిద్ధిపేట, గాంధారి తదితర ప్రాంతాల్లో గత 15 రోజులుగా కొనుగోలు ప్రక్రియ నడుస్తుందని జుక్కల్ నియోజక వర్గంలో ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు రైతులు రోడ్లు ఎక్కేదాక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయరా అంటూ అధికారులను నిలదీశారు. ఒక ఎకరానికి 25 క్వింటాల్ చొప్పున కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు డిమాండ్ చేశారు.కొనుగోలు పై ప్రభుత్వ పరంగా ఎలాంటి స్పష్టత రాని పక్షంలో జిల్లా స్థాయి వరకు ఆందోళన తీవ్ర తరం చేస్తామని రైతులు హెచ్చరించారు.దీంతో స్పందించిన తహసిల్దార్ బి . వేణు గోపాల్ గౌడ్ రైతులతో మాట్లాడి సముదాయించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగే విధంగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.




