Gandhari: గాంధారిలో రైతుల రాస్తారోకో - స్తంభించిన ట్రాఫిక్!
Gandhari: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో మొక్కజొన్న రైతుల భారీ ధర్నా. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్.
Gandhari: గాంధారిలో రైతుల రాస్తారోకో - స్తంభించిన ట్రాఫిక్!
Gandhari: కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొక్కజొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ సంగ్ ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మొక్క జొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




