Nizamabad: మిన్నంటిన రైతుల ఆగ్రహం ధాన్యం కొనాలని రోడ్డుపై ధర్నా

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 1 May 2026 5:14 PM IST
Nizamabad
X

Nizamabad: మిన్నంటిన రైతుల ఆగ్రహం ధాన్యం కొనాలని రోడ్డుపై ధర్నా

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామం లో వరి కొనుగోలు చేయడం లేదని రహదారి పైన ధర్నా చేసిన గ్రామస్తులు గత 15 రోజుల నుండి వరి ధాన్యం కోసి కళ్ళల్లో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో..గ్రామ రైతులందరూ రోడ్డుపై వరి ధాన్యం పోసి నిరసన తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు. వరి ధాన్యం కుప్పకి నిప్పు అంటించి నిరసన వ్యక్తం చేసిన రైతులు.

రోడ్డుపై వంటా వర్పు కార్యక్రమం చేపట్టిన రైతులు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన రైతులు వెంటనే ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని. రైతులకు నచ్చ చెప్పారు. ,ఐకెపి, సొసైటీ అధికారులపై రైతులు మండిపడ్డారు, ఈరోజు వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు డిమాండ్ చేసిన రైతులు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD

Next Story