Kamareddy: రోడ్డెక్కిన అన్నదాతలు.. జొన్న కొనే వరకు తగ్గేదే లే!
Kamareddy: కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్‌గల్‌లో జొన్న రైతుల భారీ ధర్నా. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్.
Kamareddy: రోడ్డెక్కిన అన్నదాతలు.. జొన్న కొనే వరకు తగ్గేదే లే!
Kamareddy: పెద్ద కొడప్ గల్ (కామారెడ్డి)రబీ సీజన్ లో రైతులు పండించిన జొన్నలు కొనుగోలు చేయాలంటూ సోమవారం పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద గల రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. ధర్నా కార్యక్రమం లో భారతీయ కిసాన్ సంఘ్ వారు పాల్గొని ధర్నా కు మద్దతు తెలిపారు.
తమ ఆరుగాలం కష్టపడి పండించిన జొన్నలు కొనుగోలు చేసేందుకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ రాకపోవడంతో ఆందోళన చెందిన రైతులు ధర్నా చేపట్టారు. తమ జొన్నలు వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారుతమ జొన్నలు కొనుగోలు చేయని పక్షంలో ఆందోళనను ఉదృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
ఈ విషయం తెలుసుకున్న తహసిల్దార్ రాజశేఖర్ ఘటన స్థలికి చేరుకొని రైతులతో మాట్లాడి వారిని సముదాయించి జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు తమ ధర్నా ను విరమించారు.




