Banswada: బాన్సువాడలో తొలిసారిగా ఫ్లడ్ లైట్ల వెలుగులో 'నైట్ క్రికెట్' టోర్నమెంట్!
Banswada: బాన్సువాడలో మొట్టమొదటిసారిగా ఫ్లడ్ లైట్ల వెలుగులో నైట్ క్రికెట్ టోర్నమెంట్. అక్టోబర్ 24 నుంచి ప్రారంభం.. విజేతకు రూ. 20 వేల నగదు బహుమతి.
Banswada: బాన్సువాడలో తొలిసారిగా ఫ్లడ్ లైట్ల వెలుగులో 'నైట్ క్రికెట్' టోర్నమెంట్!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం లో మొట్టమొదటిసారిగా రాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులో "నైట్ క్రికెట్" పేరుతో ఒక క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు.పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియం లో ఈ నెల 24 నుండి ఈ నైట్ క్రికెట్ ప్రారంభం అవుతుందని నిర్వాహకులు ఖూదుస్, ఆఫ్రోజ్,లాలా,ఇమ్రాన్, ఖాలేద్,లు కలిపారు.
పాల్గొనే జట్లు తమ ఎంట్రీ ఫీజు800/- చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని,23 వ తేదీనాడు డ్రా తీసి,24 న రాత్రి టోర్నమెంట్ ప్రారంభం చేయనున్నట్లు వారు లెలిపారు.విజేత టీమ్ కు బహుమతిగా 20 వేలు,రన్నర్ టీమ్ కు 10 వేలు నగదు ఇవ్వనున్నట్లు,ఒక జట్టులో ఎనిమిది మంది ఆటగాళ్లు ఉంటారని,ఒక్కొక్క జట్టుకు 7 ఓవర్లు ఉంటాయని,ఒక జట్టులో ఆడిన ఆటగాడు మరో జట్టులో ఆడ రాదని, షార్ట్ బౌండరీ ఉంటుందని,నిబంధనలు పెట్టినట్లు వారు తెలిపారు.
గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు, వారిలో ఉన్న నైపుణ్యం చూపించుకునే వీలు కలుగుతుందని వారు అభిప్రాయ పడ్డారు.దేహ దారుఢ్యం తో పాటు క్రీడా నైపుణ్యం,క్రీడా స్పూర్తి పెంపొందించటానికి ఉపయోగకరంగా ఉంటుందని ఈ కొత్త ఆలోచన తో బాన్సువాడలో మొట్ట మొదటి సారిగా ఈ లాంటి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నామని,వారు తేలిపారు.యువకులు క్రీడాకారులు,ఇందులో పాల్గొని విజయవంతం చెయ్యాలని నిర్వాహకులు కోరారు.




