Nizamabad: ఇందల్వాయి మండలం కేకే తాండాలో సమన్వయ అవగాహన సదస్సు!

Nizamabad: ఇందల్వాయి మండలం కేకే తాండాలో అటవీ, వన్యప్రాణుల రక్షణపై కోఆర్డినేషన్ మీటింగ్. విద్యుత్ తీగలు అమర్చినా, అటవీ భూములు ఆక్రమించినా కఠిన చర్యలని అధికారుల హెచ్చరిక.

M. RAMESH,NIZAMABAD
Published on: 17 Sept 2026 11:41 PM IST
Nizamabad
X

Nizamabad: ఇందల్వాయి మండలం కేకే తాండాలో సమన్వయ అవగాహన సదస్సు!

నిజామాబాదు: ఇందల్వాయి మండలం కేకే తాండాలో అటవీ శాఖ, ఇతర లైన్ డిపార్ట్‌మెంట్ల అధికారులు, సిబ్బంది గ్రామ ప్రజలతో కలిసి అటవీ వన్యప్రాణుల రక్షణకు సంబంధించి ప్రొటెక్షన్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీడీఓ అనంత్ రావు మాట్లాడుతూ అటవీ సంరక్షణ వన్యప్రాణుల రక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.

వన్యప్రాణులకు హాని కలిగించే విధంగా అటవీ ప్రాంతాల్లో విద్యుత్ తీగలు లేదా ఇతర ప్రమాదకర ఏర్పాట్లు చేయవద్దని గ్రామ ప్రజలకు సూచించారు.అదేవిధంగా ఇందల్వాయి ఎస్. ఐ సుమలత మాట్లాడుతూ అటవీ శాఖ సిబ్బంది తమ విధులను నిర్వహిస్తున్న సమయంలో వారిపై దాడులు చేయడం లేదా విధులకు ఆటంకం కలిగించడం సరికాదని తెలిపారు.

అటవీ శాఖ సిబ్బందికి పోలీస్ శాఖ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఎవరూ చెట్లను నరకవద్దని, పర్యావరణాన్ని అటవీ సంపదను కాపాడాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఇందల్వాయి ఎఫ్‌.ఆర్‌.ఓ రవి మోహన్ భట్ మాట్లాడుతూ అటవీ సంరక్షణ వన్యప్రాణుల రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.

అటవీ ప్రాంతాల్లో విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం, ట్రాక్టర్లతో దున్నడం, అటవీ భూమిని ఆక్రమించడం వంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు. ఇటువంటి చర్యలకు పాల్పడినట్లయితే అటవీ చట్టాలు నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అటవీ సంరక్షణలో గ్రామ ప్రజలు అటవీ శాఖకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అనంత్ రావు , ఇందల్వాయి ఎస్. ఐ సుమలత ఇందల్వాయి ఎఫ్‌.ఆర్‌.ఓ రవి మోహన్ భట్ , కేకే తాండా సర్పంచ్, ఉప సర్పంచ్, విద్యుత్ శాఖ సిబ్బంది, ఇందల్వాయి ఆర్‌.ఐ, రెవెన్యూ శాఖ సిబ్బంది, ఇతర లైన్ డిపార్ట్‌మెంట్ల అధికారులు సిబ్బంది, అటవీ శాఖ అధికారులు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఈ సమావేశం ద్వారా అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, అటవీ నేరాల నివారణ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని FRO రవీ మోహన్ బట్ తెలిపారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD