MA Shaheed: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి.. బాల్కొండ నేత షహీద్ ఆగ్రహం

MA Shaheed: కరీంనగర్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండించిన బాల్కొండ మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎంఏ. షహీద్. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శ

VENU, BALKONDA
Published on: 7 May 2026 7:15 PM IST
MA Shaheed: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి.. బాల్కొండ నేత షహీద్ ఆగ్రహం
X

బాల్కొండ: కరీంనగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై, ఎమ్మెల్యే Padi Kaushik Reddy పై బీజేపీ శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా? లేనట్లా?

ఏకంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అత్యంత దురదృష్టకరం. దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని, రాష్ట్రంలో శాంతి భద్రతలను తెలంగాణ డిజిపి కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దాడులు ఆపకపోతే… ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం. బాల్కొండ మండల మాజీ కో-ఆప్షన్ సభ్యులు ఎంఏ, షహీద్.

VENU, BALKONDA

VENU, BALKONDA

Next Story