Banswada: భాజపాలో చేరిన కాంగ్రెస్ మాజీ ఉపసర్పంచ్ బాసొల్లా సాయిలు
Banswada: బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ మాజీ ఉపసర్పంచ్ బాసొల్లా సాయిలు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ సమక్షంలో ఆదివారం భాజపాలో చేరారు.
Banswada: భాజపాలో చేరిన కాంగ్రెస్ మాజీ ఉపసర్పంచ్ బాసొల్లా సాయిలు
Banswada: బాన్సువాడ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) బలోపేతమే లక్ష్యంగా చేరికలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ధమరంచ గ్రామానికి చెందిన నాయకుడు బాసొల్లా సాయిలు బిజెపిలో చేరాడు.
బిజెపి బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారి సమక్షంలో ఈ చేరిక జరిగింది. ఎండల లక్ష్మీనారాయణ బాసొల్లా సాయిలు కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బిజెపిలో చేరుతున్నారని అన్నారు. బాసొల్లా సాయిలు చేరికతో దామరంచ గ్రామంలో మరియు బాన్సువాడ నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతున్నట్లు సంకేతం మని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బాన్సువాడలో బిజెపి జెండా ఎగరడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.
పార్టీలో చేరిన బాసొల్లా సాయిలు మాట్లాడుతూ.. ఎండల లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో, బిజెపి సిద్ధాంతాలకు కట్టుబడి నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు చందూరి హన్మండ్లు, బీర్కూర్ మండల ప్రధాన కార్యదర్శి మల్లెల యోగేశ్వర్, రాజేష్,చేపూరి హన్మండ్లు, బలరాం,సాయిబాబా, రవికాంత్, నందు పాల్గొన్నారు.




