Kamareddy: పిట్లంలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా.. మాజీ ఎమ్మెల్యే ఎంట్రీ!
Kamareddy: కామారెడ్డి జిల్లా పిట్లంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల మహాధర్నా.
Kamareddy: పిట్లంలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా.. మాజీ ఎమ్మెల్యే ఎంట్రీ!
పిట్లం (కామారెడ్డి): రైతులు పండించిన జొన్నలు కొనుగోలు చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు మహా ధర్నా చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రభుత్వం షరతులు లేకుండా జొన్నలు కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే పెంచిన యూరియా రేట్లను తగ్గించాలని, రైతు బంధును నీరుగార్చే పనిని ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. వర్ష కాలం సమీపిస్తుండటంతో రైతుల పంటలు కొనుగోలు చేయకపోవడంతో రోడ్ల పై కల్లలు వేసి ఆరబెట్టిన కల్లల వద్ద రాత్రి, పగలు అనే తేడా లేకుండా కాపలాగా ఉంటున్నారని అనుకోకుండా వర్షం పడితే జొన్న పంటలు తడిసి పోయి రైతులకు అపర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వెంటనే జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాల ని ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమం లో మాజి జడ్పి టి సి జొన్న ప్రతాప్ రెడ్డి , మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నారం వెంకట్ రెడ్డి, మాజి వైస్ ఎంపిపి నర్సగౌడ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.




