Madnoor: మద్నూర్‌లో రైతు మహా ధర్నా.. మాజీ ఎమ్మెల్యే షిండే హెచ్చరిక!

Madnoor: మద్నూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహా ధర్నా నిర్వహించారు.

VEERANNA, JUKKAL
Published on: 14 May 2026 2:21 PM IST
Madnoor
X

Madnoor: మద్నూర్‌లో రైతు మహా ధర్నా.. మాజీ ఎమ్మెల్యే షిండే హెచ్చరిక!

మద్నూర్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటల కొనుగోలు కు ప్రభుత్వం వెంటనే యాసంగి పంటల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతన్నల పంటలు కొనుగోలు చేయాలని కోరుతూ గురువారం మద్నూర్ మండల కేంద్రంలో జుక్కల్ బి ఆర్ ఎస్ మాజి ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆధ్వర్యంలో రైతు మహా ధర్నా కార్యక్రమం చేపట్టారు. రైతులు పండించిన మొక్క జొన్న, జొన్న, వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేవలం అక్కడక్కడ అడపదడపగా ఐ కె పి ఆధ్వర్యంలో చేపట్టుతున్న ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు అవసరమైన గన్ని బ్యాగులు సరఫరా చేయడం లో ఐ కె పి సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తుందని ఇక జుక్కల్ నియోజకవర్గం లొ ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చెయ్యాలేదని ప్రభుత్వ నిర్లక్ష్యం తీరుపై మండిపడ్డారు.

జొన్న విక్రయించేందుకు గాను రైతులు తమ పంటను సొసైటీ ఆవరణలో గత కొన్ని రోజులుగా అరబెట్టడం తో అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున పంట తడిసిపోయి రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఇప్పటికైన రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే యాసంగి పంటలైన పొద్దు తిరుగుడు పంట, మొక్క జొన్న, జొన్న, వరి ధాన్యం పంటలను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంటలను కొనుగోలు చేయాలని కొనుగోలు చేసిన పంటలకు వారం పది రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇది వరకు కొనుగోలు చేసిన శనగ డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేని పక్షంలో తమ బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులను ఏకం చేసి రైతుల పక్షాన తీవ్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టుతామని పేర్కొన్నారు. అనంతరం రైతులతో కలిసి తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమం లో మాజి సొసైటీ చైర్మన్ పకల్వర్. విజయ్, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బన్షి పాటిల్, ప్రధాన కార్యదర్శి గోవింద్ పాటిల్, బి ఆర్ ఎస్ యువ నాయకుడు రౌత్ వార్ కృష్ణ పాటిల్, సుల్తాన్ పేట్ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్ లతోపాటు వివిధ గ్రామాల రైతులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story