Madnoor: బూడిదైన రైతుల కష్టం.. పొలాలను చూసి చలించిపోయిన మాజీ ఎమ్మెల్యే షిండే!

Madnoor: మద్నూర్ మండలం శేఖపూర్ గ్రామంలో అగ్నిప్రమాదానికి గురైన మొక్కజొన్న పొలాలను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పరిశీలించారు.

VEERANNA, JUKKAL
Published on: 3 May 2026 1:22 PM IST
Madnoor
X

Madnoor: బూడిదైన రైతుల కష్టం.. పొలాలను చూసి చలించిపోయిన మాజీ ఎమ్మెల్యే షిండే!

Madnoor: మద్నూర్ మండలం శేఖపూర్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన పై జుక్కల్ మాజి ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆదివారం బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి బాధిత రైతుల పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ విషయం పై ప్రభుత్వం స్పందించి మానవత దృక్పథం తో ఎకరానికి లక్ష రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట సాగు కోసం రైతులు ఇతరుల వద్ద అప్పులు చేసి పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడి కాస్త బూడిదలో పోసిన పన్నీరు కావడంతో రైతులకు దిక్కు తోచని పరిస్థితి నెలకొందని పంట దిగుబడి పై ఆశలు పెట్టుకొని వారి పిల్లల చదువుల కోసం పెట్టిన పెట్టుబడి గంగ పాలైందని అన్నారు.

సకాలంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం తో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనిప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం కాదు ఆది చేతల్లో చేసి నిరూపించాలని పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే తోట ఇప్పటికైన ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మండలంలోని శేఖాపూర్, పెద్ద ఏక్లారా, కోడ్చిర, అంత పూర్ గ్రామాల్లో నష్ట పోయిన రైతులను ఆదుకొనేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమం లో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బన్షి పాటిల్, ప్రధాన కార్యదర్శి గోవింద్ పాటిల్, మాజి సొసైటీ చైర్మన్ పండిత్ రావు పాటిల్,మాజి సర్పంచ్లు గాఫర్ బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story