Jukkal: మొహమ్మదాబాద్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జయప్రదం!

Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మొహమ్మదాబాద్ గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

VEERANNA, JUKKAL
Published on: 24 July 2026 9:57 PM IST
Jukkal
X

Jukkal: మొహమ్మదాబాద్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జయప్రదం!

Jukkal: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మొహమ్మద బాద్ గ్రామం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ సుర్నార్. శకుంతల ప్రజ్ఞ కుమార్, పి హెచ్ ఎన్. శ్యామల ల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు.

వైద్య బృందం రోగులకు సాధారణ ఆరోగ్య పరీక్షలతోపాటు రక్త పోటు, మధు మొహం తదితర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే ఇటువంటి ఉచిత వైద్య శిబిరాల ప్రధాన ఉద్దేశమని వైద్య సిబ్బంది తెలిపారు.

గ్రామంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని గ్రామ ప్రజలు అభినందించారు. కార్యక్రమం లో గ్రామ పంచాయతీ కార్యదర్శి జీవన్, ఎం ఎల్ హెచ్ పి. మాధవ్, ఆశ కార్యకర్త లు జె.గంగామణి, కె.గంగామణి, ఎన్. శైలజ, లక్ష్మి లతోపాటు అంగన్వాడీ టీచర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story