Madnoor: మద్నూర్ ఏఎంసీ పదవీకాలం మరో 6 నెలలు పొడిగించండి: తీర్మానం!

Madnoor: కామారెడ్డి జిల్లా మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రస్తుత పాలకవర్గం పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని కోరుతూ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.

VEERANNA, JUKKAL
Published on: 9 Sept 2026 8:38 PM IST
Madnoor
X

Madnoor: మద్నూర్ ఏఎంసీ పదవీకాలం మరో 6 నెలలు పొడిగించండి: తీర్మానం!

మద్నూర్: మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రస్తుత పాలకవర్గం పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని కోరుతూ మార్కెట్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. బుధవారం మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటి కార్యాలయ సమావేశ హల్ లో మార్కెట్ కమిటి చైర్మన్ గొద్మే గావ్ సౌజన్య రమేష్ అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుత మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవీకాలం 2026 నవంబర్ 11తో ముగియనుంది. పాలకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి రైతులకు సేవలు అందించేందుకు శాయశక్తులా కృషి చేశామని సభ్యులు పేర్కొన్నారు.అయితే పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, రైతులకు మరింత సేవ చేసే అవకాశం కల్పించేలా మరో ఆరు నెలల పాటు పాలకవర్గం గడువును పొడిగించాలని సమావేశంలో తీర్మానించారు.

ఈ తీర్మానాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్‌రావు దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని సమావేశం లో నిర్ణయించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత పాలకవర్గానికి మరో ఆరు నెలల అవకాశం కల్పించాలని సభ్యులు కోరారు.కార్యక్రమం లో రాంచంధర్ పాటిల్, కొంచం వార్ అనిల్ సౌకర్, చాట్లవర్. శంకర్, మద్నూర్ సర్పంచ్ ఉష సంతోష్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పాటిల్, హన్మాండ్లు,మాయావతి, మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజు కుమార్ లతోపాటు మార్కెట్ కమిటి పాలక వర్గ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story