Kamareddy: బాధిత వ్యాపారులకు ఆర్థిక సాయం దుకాణాల పునర్నిర్మాణానికి హామీ
Kamareddy: కామారెడ్డి పాత బస్టాండ్ వద్ద జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరామర్శించారు.
Kamareddy: బాధిత వ్యాపారులకు ఆర్థిక సాయం దుకాణాల పునర్నిర్మాణానికి హామీ
కామారెడ్డి: శనివారం అర్ధరాత్రి అన్ని ప్రమాదం ప్రభుత్వ సలహాలు షబ్బీర్ అలీ శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగి సర్వం కోల్పోయిన చిరు వ్యాపారులను ఆదుకుంటామని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ లో అగ్ని ప్రమాద బాధితులను కలిసి వారిని పరామర్శించారు. అలాగే అగ్నిప్రమాదం కు సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అగ్ని ప్రమాద బాధితులకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ అగ్ని ప్రమాద బాధితులకు నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే దుకాణ సముదాయాలను నిర్మించడంలో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




