Banswada: చందూర్ విక్టరీ స్కూల్లో వైభవంగా బతుకమ్మ సంబరాలు!
Banswada: నిజామాబాద్ జిల్లా చందూర్ విక్టరీ స్కూల్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి దాండియా ఆడారు.
Banswada: చందూర్ విక్టరీ స్కూల్లో వైభవంగా బతుకమ్మ సంబరాలు!
Banswada: చందూర్ మండల కేంద్రంలోని విక్టరీ మోడల్ స్కూల్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి .
చందూర్ మండల కేంద్రానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించారు.మహిళలతో కలిసి ఎమ్మెల్యే పోచారం కూడా దాండియా ఆడారు.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో ముడిపడిన జీవన విధానానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు మహిళల ఆనందోత్సాహాల మధ్య సందడిగా సాగాయి.విక్టరీ స్కూల్ ప్రిన్సిపాల్ రామా రావు పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో చందూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




